ఇప్పుడు దాని మెడలో తాడు నోటికి ఈజీగా అందింది. నోటితో మెడలో తాడును దానిని కట్టేసి ఉంచిన రాడ్డు పై నుంచి మెల్లగా తప్పించింది. వెంటనే అక్కడి నుంచి ఉడాయించింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ మేక యజమాని దాని తెలివికి ముచ్చటపడిపోయాడు. ఈ సీన్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ మేక తెలివి మామూలుగా లేదుగా అంటూ కొందరు ఈ మేకను బంధించటం మహా కష్టం సుమీ అంటూ మరికొందరు వివిధ రకాల ఇమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 71000 మందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :