ఈ పండులో 92 శాతం నీరే.. తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..?

ఈ పండులో 92 శాతం నీరే.. తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..?


ఈ పండులో 92 శాతం నీరే.. తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..?
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

పుచ్చకాయలో విటమిన్ A, విటమిన్ C, బీటా కెరోటిన్, లైకోపీన్ లాంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు కూడా ఎక్కువ. ఈ పోషకాలు శరీరంలోని చాలా వ్యవస్థల పనితీరును బాగు చేస్తాయి. ఇది శరీరానికి తేమను అందిస్తుంది.

గుండె ఆరోగ్యానికి బలం

పుచ్చకాయలో ఉండే లైకోపీన్, సిట్రులైన్ లాంటి పోషకాలు గుండెకు రక్షణ ఇస్తాయి. ఇవి రక్తనాళాల ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి, రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి. దీన్ని తరచూ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గే అవకాశం ఉంది.

చర్మం, జుట్టు, కళ్ళ ఆరోగ్యానికి..

విటమిన్ A, C, B6 లాంటివి కొల్లాజెన్ తయారీని పెంచుతాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా.. కళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యల నుండి రక్షణ ఇస్తాయి.

జీర్ణక్రియ

ఈ పండులో ఉండే నీరు, పీచు పదార్థం శరీరంలో మల ప్రవాహాన్ని సులభం చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. తరచూ పుచ్చకాయ తినడం జీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.

కండరాల నొప్పులకు..

పుచ్చకాయలో ఉండే ఎల్ సిట్రులైన్ అనే అమైనో ఆమ్లం నైట్రిక్ ఆక్సైడ్‌ గా మారి కండరాలకు రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది వ్యాయామం చేశాక వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. జిమ్‌ కు వెళ్ళే వారికి పర్ఫెక్ట్ ఫ్రూట్ ఇది.

అధిక బరువు

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. నీరు, పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల తక్కువ తిన్నా ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. ఆకలిని అదుపు చేయడంలో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

తొక్కలు, విత్తనాలతో లాభం

తొక్కను పక్కన పెట్టకండి.. ఇందులో పీచు పదార్థం, సిట్రులిన్ ఉంటాయి. విత్తనాలలో మెగ్నీషియం, ఐరన్, మంచి కొవ్వులు ఉంటాయి. వీటిని వేయించి స్నాక్స్‌ గా తినొచ్చు లేదా స్మూతీల్లో కలపొచ్చు. వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోండి.

మధుమేహం వారికి సురక్షితం

పుచ్చకాయ తీపిగా ఉన్నప్పటికీ.. ఇది రక్తంలో చక్కెరపై తక్కువ ప్రభావం చూపుతుంది. ప్రోటీన్ లేదా పీచు పదార్థంతో కలిపి తక్కువ మోతాదులో తీసుకుంటే.. షుగర్ ఉన్నవాళ్ళకు కూడా ఇది హానికరం కాదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *