ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సోమనాథ ఆలయం ఒకటి. ఈ ఆలయం గురించి ప్రస్తావరణ రాగానే ప్రజలందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఈ ఆలయాన్ని చాలాసార్లు దోచుకుని నాశనం చేశారన్న విషయం. ఈ ఆలయం చాలాసార్లు నాశనం చేయబడింది. ధ్వసం చేసి మరీ దోచుకున్నారు. అయినా నేటికీ ఈ ఆలయ వైభవం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ ఆలయంపై జరిగిన దాడుల గురించి అనేక నివేదికలు, వాస్తవాలు ఉన్నాయి. ఈ ఆలయం ధ్వసం చేయబడిన ప్రతిసారీ పునర్నిర్మించబడిందనేది కూడా వాస్తవం. నిజానికి ఈ ఆలయం నిర్మాణం వెనుక పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రోజు మనం ఆలయ చరిత్ర గురించి.. ఈ ఆలయం ఎన్నిసార్లు ధ్వసం చేయబడిందో తెలుసుకుందాం..
సోమనాథ ఆలయ చరిత్ర
గుజరాత్‌లో ఉన్న సోమనాథ్ ఆలయాన్ని సోమ ప్రభువు (చంద్రుడు) బంగారంతో, రవి వెండితో, శ్రీ కృష్ణుడు గంధపు చెక్కతో, భీమ్‌దేవ రాజు రాళ్లతో నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయాన్ని నాలుగు దశల్లో నిర్మించారు. చారిత్రక వాస్తవాల ప్రకారం 11 నుంచి 18వ శతాబ్దంలో అనేక మంది ముస్లిం ఆక్రమణదారులు, పోర్చుగీసు వారిచే పదేపదే నాశనం చేయబడింది. ఇలా జరిగిన ప్రతిసారీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.
సోమనాథ ఆలయం 17 సార్లు ద్వసం
ఇవి కూడా చదవండి
ఒక నివేదిక ప్రకారం మహమూద్ ఘజ్నవి సోమనాథ్ ఆలయంపై దాడి చేసి దానిని పగలగొట్టి సంపదనంతా దోచుకున్నారు. తరువాత గుజరాత్ రాజు భీముడు, మాల్వా రాజు భోజ్ ఈ సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. 1297లో ఢిల్లీ సుల్తాన్ గుజరాత్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత సోమనాథ ఆలయం కూడా ధ్వంసం చేయబడింది.
సోమనాథ్‌లోని రెండవ శివాలయాన్ని వల్లభి యాదవ రాజులు క్రీ.శ. 649లో నిర్మించారు. దీనిని సింధ్ గవర్నర్ అల్-జునైద్ క్రీ.శ. 725లో ధ్వంసం చేశారు. సోమనాథ్ ఆలయం 17 సార్లు ధ్వంసం చేయబడిందని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రతిసారీ పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న సోమనాథ్ ఆలయాన్ని చౌలుక్య శైలిలో పునర్నిర్మించబడింది. మే 1951లో పూర్తయింది. ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్తి చేశారు.
ఇది మొట్టమొదటి,పురాతనమైన జ్యోతిర్లింగం.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ సోమనాథ్ ఆలయం అత్యంత పురాతన జ్యోతిర్లింగం. ఇది 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది. దీనిని ప్రభాస్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం గురించి స్కంద పురాణం, శ్రీమద్ భగవత్, శివ పురాణం వంటి పురాతన గ్రంథాలలో వివరించబడింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు