ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే.కస్తూరిరంగన్ శుక్రవారం మరణించారు. బెంగళూరులో ఆయన కన్నుమూశారు. ఇస్రోలో కస్తూరిరంగన్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను నిర్వర్తించారు. ఇది ధ్రువ కక్ష్యలలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎంతో ఉపయోగపడింది. కస్తూరిరంగన్ ఇస్రోతో పాటు అంతరిక్ష కమిషన్ ఛైర్మన్‌గా, అంతరిక్ష శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా 9 సంవత్సరాలకు పైగా భారత అంతరిక్ష కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపించారు, ఆగస్టు 27, 2003న తన పదవీ విరమణ చేశారు. అయితే ఆయన మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..