ఇన్నాళ్ల తర్వాత.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆ స్టార్ హీరో.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే

ఇన్నాళ్ల తర్వాత.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆ స్టార్ హీరో.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే


ఇన్నాళ్ల తర్వాత.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆ స్టార్ హీరో.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

ఇది కూడా చదవండి : గోవిందుడు అందరివాడేలేలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు చూస్తే చెక్ అవ్వాల్సిందే..

ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి త్రివిక్రమ్ మూడు సినిమాలు చేశాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకంఠాపురంలో సినిమాల్లో ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అలాగే ఎక్కువ సమయం పట్టనుంది. దాంతో త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ ఓ సీనియర్ హీరోతో సినిమా చేస్తున్నాడని అంటున్నారు.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! ఈ ఫొటోలో స్కూల్ డ్రస్ వేసుకున్న రెండు జెళ్ళ పాప గుర్తుందా.? ఇప్పుడెలా ఉందంటే

త్రివిక్రమ్ త్వరలో వెంకటేష్ తో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలోనూ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా దాదాపు ఓకే అయ్యిందని అంటున్నారు. ఈ చిత్రం ఒక కుటుంబ కథాంశంతో రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాణం కానుందని, నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి : సీన్ సీన్‌కు సితారే..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా మావ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *