ఇదేంట్రా అయ్యా.. బుక్ చేసుకుంది విమానం టికెట్లు.. పంపింది మాత్రం కార్లో..

ఇదేంట్రా అయ్యా.. బుక్ చేసుకుంది విమానం టికెట్లు.. పంపింది మాత్రం కార్లో..


అయితే వారిలో కొందరు ప్రయాణికులకి సిబ్బంది బోర్డింగ్‌ పాస్‌లు ఇవ్వలేదు. మరికొందరు ప్రయాణికులకు విమానంలో సీట్లు అందుబాటులో లేవని చెప్పారు. దీంతో అయోమయానికి గురైన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌ అధికారులను సంప్రదించారు. వారుకూడా విమానంలో సీట్లు సర్దుబాటు కాలేదని, తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. మొదట అహ్మాదాబాద్‌ వరకూ కారులో వెళ్లాలని, అక్కడినుంచి మర్నాడు మరో విమానంలో ముంబయికి పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారని ఓ ప్రయాణికుడు తెలిపాడు. అయితే కొందరు ఆ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశారని, కొందరు సీట్లు లేవనే విషయం ముందుగా ఎందుకు తెలపలేదని అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. ఘటనపై స్పందించిన ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ అనురాగ్‌ వైష్ణవ్‌ ఈ ఘటనను ధ్రువీకరించారు. ముంబయికి వెళ్లాల్సిన ఏ321 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, దాంతో చిన్న A320 విమానాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో సీట్లు తక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇక, దీనిపై ఎయిరిండియా విమానయాన సంస్థ కూడా స్పందిస్తూ ఇదే విషయాన్ని పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.10 వేల పెట్టుబడి పెట్టండి.. రూ.7 లక్షలు పొందండి

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ట్రాప్‌లో మీరూ పడ్డారా ?? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. వెంటనే అలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు!

నిర్మల్‌ జిల్లాలో కోడిగుడ్డు బాబా.. ఒకే ఒక్క గుడ్డుతో రోగాలన్నీ మాయం

పొట్ట తగ్గాలా ?? అయితే ఈ పండ్లు తినండి చాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *