ఇదెప్పుడు జరిగింది..! విజయ్ దేవరకొండతో తమన్నా కలిసి నటించిందా..? వీడియో

ఇదెప్పుడు జరిగింది..! విజయ్ దేవరకొండతో తమన్నా కలిసి నటించిందా..? వీడియో


రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ డేస్‌లో పెద్ద హిట్స్ కొట్టకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక ఇప్పుడు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కింగ్ డమ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించనున్నాడు.

విజయ్ దేవరకొండ చాలా మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ తమన్నాతో కలిసి నటించారని మీకు తెలుసా.? అవును విజయ్ దేవరకొండ, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి నటించారు. అయితే అది సినిమా కోసం కాదు ఓ యాడ్ లో ఈ ఇద్దరూ కలిసి కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే కేరీర్ బిగినింగ్ లో విజయ్ పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అలాగే కొన్ని యాడ్స్ లోనూ నటించాడు.

తమన్నా నటించిన ఓ యాడ్ లో విజయ్ దేవరకొండ కూడా కనిపిస్తాడు. తమన్నా హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టైన సమయంలో చాలా యాడ్స్ లో కనిపించింది. చాలా మంది స్టార్స్‌తో యాడ్స్ చేసింది. అలాగే ప్రముఖ సెల్ ఫోన్ బ్రాండ్ సెల్కాన్ బ్రాండ్ ప్రమోషన్ కూడా చేసింది. ఇందుకోసం చేసిన ఓ యాడ్ లో విజయ్ కూడా కనిపిస్తాడు. ఈ యాడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ చాలా యంగ్ గా కాలేజీ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఈ వీడియోను విజయ్ అభిమానులు, తమన్నా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *