అలాగే వారానికి నాలుగు రోజుల పని దినాలు అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పీఎఫ్ వాటా పెరిగితే ప్రతి నెలా వచ్చే శాలరీ తగ్గే సూచనలు ఉన్నాయి. తొలిదశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు ఈ కోడ్‌లను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. రెండో దశలో 100-500 మంది ఉద్యోగులున్న మధ్యస్థ సంస్థలు.. మూడో దశలో 100లోపు ఉద్యోగులున్న చిన్న సంస్థలకు తప్పనిసరి చేయనున్నారు. కొత్త కార్మిక విధానం ప్రకారం.. ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు దాదాపు రెండేళ్లు సమయం పడుతుంది. భారత వ్యాపార నిర్మాణంలో 85 శాతం కంటే ఎక్కువ వాటా చిన్న పరిశ్రమలదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృతం చేసింది. యాజమాన్యాలతోపాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్ ఈ నాలుగు కొత్త కోడ్‌లు. ఇవి అమల్లోకి వస్తే.. వారంలో నాలుగు రోజుల పని విధానం ఉండే అవకాశాలు ఉణ్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేంద్రం గుడ్ న్యూస్..! రూ.10 లక్షల వరకూ నో ట్యాక్స్ ?
ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి
కొలంబియా యూటర్న్.. ట్రంప్ నిబంధనలకు ఓకే
కుంభమేళా చుట్టూ చిట్టడవి.. స్వచ్ఛమైన గాలికి కొదవే లేదు..
శివ శంకర్‌గా మారిన సద్దాం హుసేన్.. ప్రియురాలి కోసం హిందువుగా