ఇక రూ.5లకే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌.. ఎక్కడో తెలుసా?

ఇక రూ.5లకే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌.. ఎక్కడో తెలుసా?


అయితే ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని, లేనిపక్షంలో గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పిన మాట. అయితే అందరికీ అల్పాహారం తీసుకునే అవకాశం ఉండదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అలాంటి వారికోసం ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే రూ.5 లకే మధ్యాహ్నం భోజనం పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు అల్పాహారం కూడా అందించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలు, సామాన్యులకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి. అతి తక్కువ ధరకే అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 5కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలోనే ఇకపై రుచికరమైన టిఫిన్ కూడా అందుబాటులోకి రానుంది. గ్రేటర్ పరిధిలోని 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని జీహెచ్ఎంసీ తీర్మానించింది. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లను ప్రజలకు అందిస్తారు. ఒక్కో టిఫిన్ తయారీకి రూ. 19 ఖర్చవుతుందని అంచనా వేశారు. లబ్ధిదారుడి నుంచి రూ. 5 వసూలు చేసి, మిగిలిన రూ. 14ను జీహెచ్ఎంసీ సబ్సిడీగా భరించనుంది. ఈ అల్పాహార పథకం కోసం ఏటా సుమారు రూ. 15.33 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. దీంతో పాటు, ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా ఆధునీకరించేందుకు రూ. 11.29 కోట్లు, మరో 11 కేంద్రాల మార్పు కోసం రూ. 13.75 లక్షలు వెచ్చించనున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 30 వేల మందికి పైగా రూ. 5కే భోజనం చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అల్పాహారం కూడా అందుబాటులోకి వస్తుండటంతో మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోట Vs కృష్ణ వంశీ !! ఒకప్పుడు వీళ్లు ఎంతలా గొడవ పడ్డారంటే ??

పాటతో దేశాన్ని ఊపిన ఫోక్ సింగర్‌కు కింగ్ నాగ్ బంపర్ ఛాన్స్?

షో చూడు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పట్టు.. సుడిగాలి సుధీర్ నుంచి బంపర్ ఆఫర్ !

‘నెలకు 40 లక్షలు భరణంగా ఇవ్వాలి’ మాజీ భార్య దెబ్బకు..

బంగారం లాంటి ఛాన్స్‌ వస్తే.. ఈ పిల్ల కాళ్లతో తన్నింది..

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *