
సినీప్రియులు అత్యధికంగా ఇష్టపడే సౌత్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూల్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇదెలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ తన కెరీర్ గురించి కాకుండానే పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తనకు ఓ హీరోయిన్ తో నటించాలని ఉందని వెల్లడించారు.
ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ అందాల తార కాజోల్. ఎన్నో హిట్ చిత్రాల్లో కాజోల్ తన పాత్రలకు ప్రాణం పోసిన తీరు ఎంతో అందంగా ఉంటుందని తెలిపాడు దుల్కర్. కాజోల్ పోషించే పాత్రలకు అన్ని భావోద్వేగాలను ప్రేక్షకులు నిజంగా అర్థం చేసుకోగలరని అన్నారు. ‘నాకు కాజోల్‌తో నటించాలని ఉంది. ప్రతి సినిమాలో ఆమె పాత్రలను చూపించిన తీరు అద్భుతం. తన పాత్రలకు ఎంత అందంగా జీవం పోస్తుంది. ప్రేక్షకులు తమ ప్రతి కథలోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఆమె నవ్వితే గుండెల్లో నుంచి నవ్వినట్లుగా అనిపిస్తుంది. ఇక ఆమె ఏడ్చే పాత్రలు అదే ఎమోషనల్ రోల్స్ చేస్తే నిజంగానే జరిగిందా అన్నట్లుగా కనిపిస్తుంది. ఆమె పాత్రలను అంత చిత్తశుద్ధితో పోషిస్తుంది ‘ అన్నారు దుల్కర్ సల్మాన్.
దుల్కర్ సల్మాన్ చివరిగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ నాగ వంశీ, సాయి గ్రియ నిర్మించారు. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. తెలుగులో డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడని, ఈ చిత్రాన్ని శ్రీ లష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించబోతున్నారని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.