లేడీ పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల చేత పిలుపించుకుంటున్న సాయి పల్లవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. మొన్నీమధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ. ఇటీవలే తమిళ్ లో అమరన్ సినిమాతో తెలుగులో తండేల్ సినిమాలతో హిట్స్ అందుకుంది. అక్కినేని అందగాడు నాగచైతన్యతో కలిసి నటించిన తండేల్ మంచి విజయాన్ని అందుకుంది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టనుంది సాయి పల్లవి. అక్కడ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న రామాయణం సినిమాలో సీతమ్మ పాత్రలో కనిపించనుంది ఈ నేచురల్ బ్యూటీ. ఆమధ్య ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోల్లో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించగా సీతగా సాయి పల్లవి చూడముచ్చటగా కనిపించి ఆకట్టుకుంది.
6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
ఇదిలా ఉంటే సాయి పల్లవికి ఓ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఆ హీరో అంటే సాయి పల్లవికి ఎంతో అభిమానం అంట.. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్నీ సాయి పల్లవి స్వయంగా చెప్పింది.. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. సాయి పల్లవికి మెగాస్టార్ చిరంజీవి అంటే చాల ఇష్టం. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. దాంతో కొంతమంది షాక్ అవుతున్నారు. ఈ జనరేషన్ అమ్మాయి అయ్యుండి.. ఏ అల్లు అర్జున్ పేరో లేక పవన్ కళ్యాణ్ పేరో.. లేదా ప్రభాస్, మహేష్ పేర్లో చెప్తుంది అనుకుంటే ఏకంగా బాస్ పేరు చెప్పింది. దట్ ఈజ్ సాయి పల్లవి అని అంటున్నారు అభిమానులు.
ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు
అయితే సాయి పల్లవికి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చిన కూడా ఆ ఛాన్స్ ను వదులుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా సాయి పల్లవిని సంప్రదించారు. కానీ చిరంజీవి అంత గొప్ప నటుడితో నటించలేను అని చెప్పిందట. తాను అంతగా అభిమానించే హీరోతో నటించడం చాలా కష్టం అని తెలిపింది సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది. తమిళ్, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీలో సత్తా చాటడానికి రెడీ అవుతుంది. మరి సాయి పల్లవి అక్కడ ఎంతగా సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.