తూర్పు చైనా లోని ఆంహుయ్ ప్రావిన్స్‌లో తల్లీకూతుళ్ల వీడయో నెటిజన్లను కలచివేసింది. పోర్టబుల్ కీమో పరికరంతో ఆ చిన్నారి దీనంగా బండి వెనక కూర్చోవడం చూసి నెటిజన్లు చలించిపోయారు. రెండేళ్లుగా ట్యూమర్‌తో పోరాడుతోంది చిన్నారి నోక్సీ. ఆమె తండ్రి కూడా ఫుల్ టైమ్ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తుండటంతో నోక్సి చికిత్స కోసం డబ్బు సరిపోక తల్లి జు డెలివరీ ఏజెంట్‌గా రోడ్డెక్కింది. మెట్లెక్కి వెళ్లి డోర్ డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు ఆమె పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక చేత్తో ఫుడ్ బాక్స్ మరో చేత్తో పాపను ఎత్తుకుని పైకి ఎక్కుతూ దిగుతూ కష్టపడుతోంది. వీడియో చాలా మంది హృదయాలను తాకింది. తల్లి కూతుళ్ల ఆత్మబలానికి త్యాగానికి నెటిజన్లు సంఘీభావం ప్రకటించారు, వారికి మద్దతుగా నిలిచారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా , తన కుమార్తె ముఖంలో చిర్నవ్వు తన కష్టాన్ని మరచిపోయేలా చేస్తుందని జు తెలిపింది. చిన్నారికి ఇప్పటికే పలు సర్జరీలు జరిగాయని అంది. దీంతో విరాళాలు వెల్లువెత్తాయి. స్థానిక ప్రభుత్వం సహాయం అందించింది. తల్లి జూ ఇంట్లోనే ఉండాలని, తండ్రి మాత్రమే పని చేయాలని ఓ నిర్ణయానికొచ్చారు. చైనాలో డెలివరీ ఏజెంట్లుగా వలస కార్మికులకు రెండు చేతులా పని ఉంటోంది.
మరిన్ని వీడియోల కోసం :