ఆ రోడ్డు వంతెన మీదుగా ఉంది. ఓ వైపు రోడ్డుపై వస్తున్న వ్యాన్ ఒకటి లెఫ్ట్ టర్న్ తీసుకొని వంతెన మీదుగా వెళ్తోంది. అదే సమయంలో మరోవైపు నుంచి ఓ బైకుపైన ముగ్గురు యువకులు వేగంగా వస్తున్నారు. వాస్తవానికి ఈ బైకు కూడా ఆ వంతెన మీదుగా వెళ్లాలి. ఈ క్రమంలో వేగంగా వస్తున్న బైకు వ్యానును ఎక్కడ ఢీకొడుతుందోనని కాస్త తడబడ్డారు ఆ యువకులు. దాంతో అదుపుతప్పి ఆ బైకు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. బైకు వెనుక చివరన కూర్చున్న వ్యక్తి ప్రమాదాన్ని పసిగట్టి అలర్టయ్యాడు. బైకు కాల్వలోకి దూసుకెళ్తున్నప్పుడు ఎంతో చాకచక్యంగా వంతెనకు గ్రిల్‌లా ఏర్పాటుచేసిన ఇనుపరాడ్‌ను పట్టుకొని తప్పించుకున్నాడు. మిగతా ఇద్దరూ బైకుతో సహా కాల్వలో పడిపోయారు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను కొన్ని గంటల్లోనే 3 లక్షల మందికిపైగా వీక్షించారు. వేలాదిమంది లైక్ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్ ఆడిన కాకి.. వీడియో వైరల్
103 ఏళ్ల బామ్మ మేకప్ పాఠాలు.. ఫిదా అవుతున్న యూత్
లాటరీలో వచ్చిన రూ.30 కోట్లు ప్రియురాలి అకౌంట్లో వేశాడు.. మరుక్షణం ఆమె
ఈ యువకుడి ఐడియాను మెచ్చుకోకుండా ఉండలేరు..
పాములను పట్టి అడవిలో వదులుదామని వెళ్లిన స్నేక్ క్యాచర్‌కు ఊహించని షాక్