అర్ధరాత్రి రోడ్డుపై బర్త్‌ డే వేడుకలు! సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన సీఐ.. ఆ తర్వాత

అర్ధరాత్రి రోడ్డుపై బర్త్‌ డే వేడుకలు! సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన సీఐ.. ఆ తర్వాత


అర్ధరాత్రి రోడ్డుపై బర్త్‌ డే వేడుకలు! సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన సీఐ.. ఆ తర్వాత
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

నగరంలో యువత ఎక్కువగా రాత్రుళ్లు రోడ్లపై చక్కర్లు కొడుతూ గాలి తిరుగుళ్లు తిరుగుతున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని సార్లు కొంతమంది వల్ల శాంతిభద్రతలకు విఘాతం కూడా కలుగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ పరిరక్షణలో భాగంగా పోలీస్ వ్యవస్థ ఎంత కట్టడి చేసినా పూర్తిగా యువత అల్లరి తగ్గడం లేదు. పైగా ఫుల్లుగా మద్యం తాగేసి అర్థరాత్రి అపరాత్రి అని లేకుండా విచ్చలవిడితనం మితిమీరి స్థానికులను ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా హైదరాబాద్ నగరం ఉప్పల్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

కొంతమంది యువకులు ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పైగా నానా హడావిడి చేస్తూ గట్టిగట్టిగా అరుస్తూ వచ్చీపోయేవాళ్లని ఇబ్బందులకు గురి చేశారు. ఈ క్రమంలోనే ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్, రామాంతపూర్ ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుతున్న ఆ యువకులకు ఉప్పల్ పోలీసులు బుద్ధి చెప్పారు. ఉప్పల్, భగాయత్ రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా అడ్డంగా బుక్ అయ్యారు ఆ యువకులు. ముఖ్యంగా రాత్రి సమయంలో సమయానికి మించి రెస్టారెంట్లు, బార్‌లు, షాపులను నడిపించడం కూడా యువత ఇలా చెలరేగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

సీఐ ఎలక్షన్ రెడ్డి, సిబ్బందితో కలిసి అర్ధరాత్రి రోడ్ల మీద జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యువకులను ఆరా తీశారు. రోడ్ల మీద ఇలా చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు. మీ వయసు ఎంత అంటూ నిలదీయగా.. ఆ యువకులు ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉండిపోయారు. దీంతో సీఐ ఇలా అర్ధరాత్రి రోడ్ల మీద హడావిడి చేయడం సరికాదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఉండవని ఆ యువకులను హెచ్చరించారు. వెంటనే అక్కడి నుంచి ఆ యువకులను ఖాళీ చేయించి, ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నగరంలో ఏ ప్రాంతంలో అయినా ఇలా రోడ్ల మీద జన్మదిన వేడుకలు అంటూ హద్దూ అదుపు లేకుండా ప్రవర్తిస్తే తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీఐ ఎలక్షన్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *