ఓ బుల్లి చింపాంజీ తన తల్లిని విసిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ జూలోని తన డెన్‌లో తల్లి చింపాంజీ గడ్డిని పాన్పులాగా సర్దుతుంటుంది. ఇంతలో అక్కడికి తన బేబీ చింపాంజీ పరుగెత్తుకుంటూ వచ్చింది. నేనూ సర్దుతాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. తల్లి చింపాంజీ సరే సర్దు అన్నట్టుగా చూసింది. ఆ చిట్టి చింపాంజీ గడ్డి సర్దక పోగా తల్లి చక్కగా పోగేసిన గడ్డిని చిందరవందరగా చల్లేసి అక్కడినుంచి పరుగెత్తింది. అది చూసి తల్లి చింపాంజీ అయ్యో దేవుడా.. అన్నట్టుగా తన రెండు చేతులతో తలపట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ గడ్డినంతా సర్దుకుంది. ఈ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు పెడుతున్నారు. చిట్టి చింపాంజీ అల్లరి మామూలుగా లేదుగా అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..!
బెంగుళూరులో హడలెత్తించిన సైకో పోలీస్ రియల్ కథ! ది బెస్ట్ డార్క్ థ్రిల్లర్ సిరీస్!
ఈయన ఇలా ఉన్నాడేంట్రా ?? ఇంట్లో దొంగలు పడితే పిలిచి డబ్బిస్తారా ??
Kingdom: విజయ్ ఖాతాలో మరో హిట్ ?? కింగ్‌డమ్ సినిమా ఎలా ఉందంటే