అబ్బాయిలకు సహజంగానే మీసాలు, గడ్డం ఉంటాయి. వీరికి పుట్టుకతో వచ్చే లక్షణాలు ఇవి. కానీ కొందరు అమ్మాయిలకు కూడా ఇలా ముఖంపై అబ్బాయిల మాదిరి గడ్డం, మీసాలు వచ్చేస్తుంటాయి. దీంతో వారు నలుగురిలోకి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు. అందుకే వీళ్ళు కూడా ప్రతి రోజూ అబ్బాయి మాదిరి గడ్డం షేవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే, అందరు అమ్మాయిల మాదిరిగా ముఖాన్ని క్లీన్‌గా ఉంచుకోవడం సాధ్యం కాదు. వాళ్ళు ఎంత దాచడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. మరి ఈ సమస్యకు కారణం ఏమిటి? దీన్ని నివారించడానికి ఏమి చేయాలో? ఇక్కడ తెలుసుకుందాం..
చాలా మంది అమ్మాయిలకు పై పెదవి, గడ్డం మీద వెంట్రుకలు పెరిగే సమస్య ఉంటుంది. ఎందుకంటే వీరి శరీరంలో పురుష హార్మోన్ అయిన ఆండ్రోజెన్ అధిక స్థాయిలో ఉంటుంది. అందువల్లనే ఇలా జరుగుతుంది. అయితే ఈ హార్మోన్లను తగ్గించడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యను వదిలించుకోవడానికి మాత్రలు లేదా మందులను ఆశ్రయించే బదులు ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు.
ముఖంపై వచ్చే వెంట్రుకలను శాశ్వతంగా తగ్గించడానికి.. ముందుగా ఒక చెంచా ధనియాలు తీసుకోవాలి. దానికి చిటికెడు దాల్చిన చెక్క పొడి లేదా లవంగాల పొడిని వేసి నీటిలో బాగా మరిగించాలి. అనంతరం ఈ నీటిని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగడం ప్రారంభించాలి. ఈ అలవాటును ఒక నెల పాటు రోజూ అనుసరించాలి. నెల తర్వాత తేడాను మీరే చూస్తారు. ఈ ఆరోగ్యకరమైన సహజ రెమెడీ ఒంట్లో ఆండ్రోజెన్ స్థాయిలు క్రమంగా తగ్గిపోయేలా చేస్తుంది. మీకు ఈ సమస్య ఉంటే మందులకు బదులు ఈ సులభమైన ఇంటి నివారణ చిట్కా ప్రయత్నించండి.
ఇవి కూడా చదవండి
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.