మనం తరచుగా చాలా వంటకాల్లో పచ్చి మిరపకాయలను కారపు రుచిని జోడించడానికి ఉపయోగిస్తాము.. కానీ కొంతమంది దానిని పచ్చిగా కూడా తీసుకుంటారు. కానీ కొంతమందికి మిరపకాయ రుచి చూడగానే నోరు మండడం ప్రారంభమవుతుంది. కానీ అలాంటి కారంగా ఉండే పదార్థం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.. అవును పచ్చి మిరపకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిరపకాయల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడాని సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి పచ్చి మిరపకాయ పేరు వింటేనే.. చాలా మంది భయపడతారు.. దీని మంట నషాళానికి ఎక్కుతుంది. ఎందుకంటే కారంగా ఉండటం వల్ల దానికి చాలా మంది దూరంగా ఉంటారు. అయితే.. దాని పోషక విలువలు గురించి తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరని.. మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. పచ్చి మిరపకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
పచ్చి మిరపకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది – అందం పెరుగుతుంది: పచ్చి మిరపకాయలు విటమిన్ సి గొప్ప వనరుగా పరిగణిస్తారు. దీనితో పాటు ఇందులో బీటా-కెరోటిన్ కూడా ఉంటుంది.. ఈ రెండు పోషకాలు మన చర్మానికి మేలు చేస్తాయి. ఇది చర్మం మెరుపు, బిగుతు, మెరుగైన ఆకృతిని నిర్వహించడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
ఐరన్ సమృద్ధిగా ఉంటుంది: పచ్చి మిరపకాయలలో కూడా చాలా ఐరన్ ఉంటుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి చాలా ముఖ్యమైనది. దీని కారణంగా, మన శరీరానికి శక్తి లభిస్తుంది.. శరీరం చురుకుగా ఉంటుంది.. దీంతో మీరు ఎలాంటి అలసటను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.. ఇనుము మన చర్మానికి కూడా మేలు చేస్తుంది.. ఇంకా బ్రెయిన్ ను చురుకుగా ఉంచుతుంది..
శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది: పచ్చి మిరపకాయలలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం కనిపిస్తుంది. ఇది మెదడులోని హైపోథాలమస్ శీతలీకరణ కేంద్రాన్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. భారతదేశం వంటి వేడి దేశాల ప్రజలకు పచ్చి మిరపకాయలను నమలడం ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి ఉండటం వల్ల, ఇది మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇంకా ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది. ఇన్ఫెక్షన్ కారణంగా జలుబు – దగ్గుతో బాధపడేవారికి, పచ్చి మిరపకాయలు దివ్యౌషధం కంటే తక్కువ కాదు.. ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని పలుచన చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..