అదృష్టం అంటే ఇదే.. కూలీకి దొరికిన ‘8 వజ్రాలు’

అదృష్టం అంటే ఇదే.. కూలీకి దొరికిన ‘8 వజ్రాలు’


మధ్య ప్రదేశ్‌లోని ఛ‌త‌ర్‌పూర్ జిల్లాలోని క‌టియా గ్రామానికి చెందిన హ‌ర్‌ గోవింద్‌, ప‌వ‌న్ దేవి దంప‌తులు గ‌త ఐదేళ్లుగా ప‌న్నాలోని నిసార్ గ‌నిలో ప‌నిచేస్తున్నారు.వజ్రం కోసం తవ్వుతూనే ఉన్న ఈ దంపతులకు చివరికి అదృష్టం తలుపుతట్టింది. ఒకేసారి 8 వజ్రాలు లభించాయి. అందులో కొన్నీ ముడి వజ్రాలు కాగా, మరికొన్ని శుద్ధమైనవే. వీటి విలువ రూ.10 – 12 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వజ్రాలను పన్నాలోని వజ్రాల మ్యూజియానికి చేర్చి, అక్కడి నిపుణులు వాటి విలువను అంచనా వేశాక.. వాటిని వేలం వేయనున్నారు. వేలంలో వచ్చిన మొత్తం నుంచి టాక్సులు పోగా మిగిలిన డబ్బును గోవింద్ కుటుంబానికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా హ‌ర్‌గోవింద్ మాట్లాడుతూ…‘భ‌గ‌వంతుడు ఈసారి మ‌మ్మల్ని క‌నిక‌రించాడు. గ‌తంలో ఓసారి ఒక వ‌జ్రం దొరికితే.. తెలియ‌క ల‌క్షకే అమ్మాను. ఈసారి ఆ తప్పు చేయను’అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సౌరవ్యవస్థలో అరుదైన వస్తువు.. ఏలియన్స్‌కు చెందినదా

ఓర్నీ ట్యాలెంటో.. కారును అక్కడెలా పార్క్‌ చేశావ్‌ సామీ

బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్

చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్‌

అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *